విజయ్ దేవరకొండ నిర్మాతగానూ బిజీనే !

Published on Feb 28, 2021 9:04 pm IST

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు. హీరోగా సినిమాలు చేస్తూనే అటు నిర్మాతగానూ విజయ్ దేవరకొండ చిన్న సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే తరుణ్ భాస్కర్ హీరోగా ఒక సినిమా చేసిన విజయ్ రేపు మరో సినిమాని ప్రకటించబోతున్నాడు. అలాగే ఒక వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో ఉన్నాడట విజయ్. కాగా ఈ వెబ్ సిరీస్ నేపథ్యం పూర్తిగా అల్ట్రా మోడ్రన్ లైఫ్ స్టైల్ లో ఉండబోతుందని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తోన్నాడు. ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తుండటం, పైగా మొదటిసారి పాన్ ఇండియా మూవీ చేస్తోన్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాని పూరితో కలిసి ఛార్మి మరియు కరుణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :