100కోట్ల క్లబ్ లో చేరిన సెన్సేషనల్ హీరో !

Published on Aug 27, 2018 4:47 pm IST


అర్జున్ రెడ్డి తో ఒక్కసారిగా యూత్ లో విపరీతమైన క్రెజ్ ను సంపాదిచుకొని సెన్సేషనల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు యువ హీరో విజయ్ దేవరకొండ. ఆయన నటించిన తాజా చిత్రం గీత గోవిందం. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం అద్భుతమైన కలెక్షన్స్ తో 100కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

12రోజులకుగాను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 52. 11కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం ఈ ఏడాది రంగస్థలం, భరత్ అనే నేను , మహానటి చిత్రాల తరువాత ఆ తరహా బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాతో విజయ్ స్టార్ హీరోల జాబితాలో చోటు సంపాదించడమే కాకుండా తన మార్కెట్ ను పెంచుకున్నాడు.

సంబంధిత సమాచారం :

More