విభిన్నమైన పాత్రలో విజయ్ దేవరకొండ !

విభిన్నమైన పాత్రలో విజయ్ దేవరకొండ !

Published on Oct 18, 2018 3:56 AM IST


‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫెమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సరసన రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్‌, ఇసాబెల్లె డి ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమా కథ గురించి ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ ఆసక్తికరమైన వార్త హల్ చల్ చేస్తోంది. దర్శకుడు క్రాంతి మాధవ్ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి ఫ్యూర్ లవ్ స్టోరీతోనే ఈ సినిమాను రూపొందిస్తున్నారట.

కాగా సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ చాలా వైవిధ్యంగా ఉంటుందని.. ముఖ్యంగా ప్రేమలో అతని దృష్టికోణం కూడా పూర్తీ విభిన్నంగా సాగుంతుందని.. ఈ క్రమంలో ముగ్గురు హీరోయిన్లకు హీరోకు మధ్య జరిగే సంఘటనలు చాలా ఆసక్తికరంగా.. సినిమా పై ఉత్సుకతను పెంచేవిధంగా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ సీనియర్ నిర్మాత కె.ఎస్.రామరావు నిర్మిస్తున్నారు. ఇక విజయ్‌ దేవరకొండతో ఇటీవలే ‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్‌ చిత్రానికి పాటలందించిన గోపీసుందర్‌ నే ఈ చిత్రానికి కూడా స్వరాలనందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు