మే నుండి విజయ్ దేవరకొండ కొత్త సినిమా !
Published on Feb 25, 2018 6:48 pm IST

అర్జున్ రెడ్డి సినిమా తరువాత విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో పరుశురం బుజ్జి దర్శకత్వంలో ఒక సినిమా రాహుల్ సంకృతియ‌న్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా విజయ్ నటించిన ఏ మాత్రంవేసావే సినిమా మర్చి 16 న విడుదల కాబోతోంది. విజయ్ బిగినింగ్ డేస్ లో సినిమా సినిమా ఇది. అర్జున్ రెడ్డి విడుదల తరువాత విజయ్ క్రేజ్ తో ఈ సినిమా విడుదల కాబోతోంది.

తాజాగా మేరకు విజయ్ దేవరకొండ భరత్ కమ్మ అనే నూతన దర్శకుడితో సినిమా చెయ్యబోతున్నాడు. మే నుండి ఈ సినిమా ప్రారంభం కానుంది. యష్ రంగినేని ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. రాస్మిక మడోన ఈ సినిమాలో హీరోయిన్. ఈ మూవీ తరువాత విజయ్ తమిళ్ లో ‘ఇరుముగన్’ సినిమాకు దర్శకత్వం వహించిన ఆనంద్ శంకర్ తో సినిమా చెయ్యబోతున్న విషయం తెలిసిందే.

 
Like us on Facebook