పవర్ ఫుల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ !

పవర్ ఫుల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ !

Published on Dec 29, 2018 9:49 AM IST


సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ , కన్నడ బ్యూటీ రష్మిక మండన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఇక గత కొన్ని రోజులుగా చిత్రం కాకినాడ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నిన్నటితో ఆ షెడ్యూల్ ను పూర్తి . ఇక ఇప్పటివరకు 4షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయని సమాచారం. ఈ చిత్రంలో విజయ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా నటింస్తుండగా రష్మిక స్టూడెంట్ కమ్ క్రికెటర్ పాత్రలో కనిపించనుంది.

నూతన దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే లో విడుదలకానుంది. ప్రభాకరన్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు