రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న హై-బడ్జెట్ పీరియాడిక్ డ్రామా ‘రణబాలి’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా దూసుకుపోతోంది. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక తాజాగా ఈ చిత్రం విజయవంతంగా 100 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.
మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 90 శాతం పైగా షూటింగ్ పార్ట్‌ను ముగించుకుంది. మిగిలిన భాగాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టాలని చిత్రబృందం భావిస్తోంది.
19వ శతాబ్దపు బ్రిటీష్ పాలన కాలం నాటి చారిత్రక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది.


