నాకు చాలా నిరాశగా ఉంది, ఏడుపొస్తుంది – విజయ్ దేవరకొండ

Published on Aug 12, 2018 2:53 pm IST

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గీత గోవిందం’. గీతా ఆర్ట్స్- 2 బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కడంతో ఈ చిత్రం పై మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యాయి. గుంటూరులోని కొంతమంది స్టూడెంట్స్ గీతగోవిందం చిత్రంలోని కొన్ని సన్నివేశాలను షేర్‌ చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.

కాగా తాజాగా ఈ చిత్ర హీరో విజయ్ దేవరకొండ ఈ చిత్రం లీక్ అవ్వటం పై స్పందించారు. ‘నాకు చాలా నిరాశగా ఉంది.. ఐ హర్ట్.. ఇప్పుడు ఒక్కసారిగా కోపం వస్తుంది.. అంతలోనే మళ్ళీ ఏడుపొస్తుంది’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ చిత్రానికి పోస్ట్‌ ప్రొడక్షన్‌ చేసిన టెక్నికల్ టీంలోని ఓ వ్యక్తి ఆ సన్నివేశాలను కాపీ చేసి తన ఫ్రెండ్స్ కు పంపించటం జరిగింది. పోలీసులు లీక్ చేసిన వ్యక్తులను షేర్ చేసిన వాళ్ళను కూడా విచారిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

X
More