యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా పుట్టినరోజును పురస్కరించుకుని, ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రౌడీ జనార్దన” చిత్ర బృందం సరికొత్త వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేసింది. ఈ స్టిల్స్ సినిమా సెట్స్‌లో రవి కిరణ్ కోలా చూపిస్తున్న డెడికేషన్, అభిరుచిని తెలియజేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. గ్రాండ్ పాన్-ఇండియా రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా విజయ్ను పవర్ఫుల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ రోల్లో చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక డైరెక్టర్ బర్త్‌డే సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు. “హ్యాపీ బర్త్‌డే రవి కిరణ్ కోలా.. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రతిసారీ షూటింగ్‌కి రావడానికి ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంటాను. నువ్వు భవిష్యత్తులో తెలుగు సినిమాకు ఒక పెద్ద బలంగా మారుతావు” అంటూ విజయ్ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్‌తో పాటు సినిమాపై ఉన్న నమ్మకాన్ని స్పష్టం చేస్తోంది.


