విజయ్ హవా..ఈ జాబితాలో టాప్ 3.!

విజయ్ హవా..ఈ జాబితాలో టాప్ 3.!

Published on Aug 22, 2020 11:42 AM IST

Vijay Deverakonda 2

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నిలదొక్కుకున్న తర్వాత అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ను సంతరించుకున్నాడని చెప్పాలి. కేవలం ఒక్క మన తెలుగులో మాత్రమే కాకుండా మన దక్షిణాది సహా బాలీవుడ్ సినీ వర్గాల్లో కూడా మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాడు.

అయితే గత ఏడాది తన ఖాతాలో సరైన విజయం లేనప్పటికీ కూడా విజయ్ టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియా జాబితాలో టాప్ 5 జాబితాలో నిలిచాడు. అది కూడా టాప్ 5 అంటే ఐదో స్థానంలో కూడా కాదు ఏకంగా టాప్ 3 లో నిలిచాడు. దీనితో విజయ్ హవా ఏ స్థాయిలో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

మొత్తం టాప్ 10 లో కూడా మన టాలీవుడ్ నుంచి కేవలం విజయ్ మాత్రమే ఉండటం విశేషం. ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో బాలీవుడ్ స్టార్ హీరోలు షాహిద్ మరియు రణ్వీర్ సింగ్ లు ఉండగా వారి తర్వాత విజయ్ నిలిచాడు. ప్రస్తుతం విజయ్ మాస్ దర్శకుడు పూరితో ఒక పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు