ఫ్యాన్స్ కోసం ఏ హీరో చెయ్యని విధంగా చేస్తున్న ‘విజయ్ దేవరకొండ’ !

ఫ్యాన్స్ కోసం ఏ హీరో చెయ్యని విధంగా చేస్తున్న ‘విజయ్ దేవరకొండ’ !

Published on Jun 12, 2018 11:04 AM IST

Vijay Devarakonda

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో స్టార్ హీరో స్టేటస్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఎంత బిజీగా ఉన్నా విజయ్ తన ఫ్యాన్స్ కు ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా టచ్ లోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఏకంగా తన అభిమానుల కోసం రౌడీక్లబ్ అనే వెబ్ సైట్ ను కూడా ప్రారంభించాడు. ఆ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకున్న ఫ్యాన్స్ లో ఒకర్ని ఎంపిక చేస్తానని, వాళ్ళు తనను ప్రత్యేకంగా కలుసుకోవచ్చని కొంత అంతేగాక తనతో పాటే వారిని స్వయంగా ‘సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్’ కు తీసుకోని వెళ్తానంటున్నాడు.

తనని హీరోగా నిలబెట్టిన అభిమానులకు విజయ్ దేవరకొండ ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం, వారికి ఎంతోకొంత తిరిగి ఇవ్వాలనుకోవడం చాలా వినూత్నంగా ఉంది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న తమిళ ‘నోటా’ చిత్రంలో విజయ్ బిజీగా ఉన్నారు. అఆయన నటించిన ‘టాక్సీవాలా’ కూడ త్వరలోనే విడుదలకానుంది.

తాజా వార్తలు