విడుదలకు సిద్దమైన విజయ్ దేవరకొండ సినిమా !
Published on Feb 24, 2018 3:09 pm IST

‘పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి’ లాంటి బ్లాక్ బస్టర్లతో విజయ్ దేవరకొండ మంచి స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలతో సినిమాలు చేస్తున్నారు. రాబోయే వేసవికి అవి విడుదలకానున్నాయి. ఇదిలా ఉండగా విజయ్ స్టార్ కాకముందు చేసిన ‘ఏ మంత్రం వేశావే’ అనే సినిమా కూడ అన్ని అడ్డంకులను తొలగించుకుని విడుదలకు సిద్ధమైంది.

మార్చి 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. నిజానికి పలుసార్లు వాయిదాపడిన ఈ చిత్రాన్ని ‘పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి’ వంటి సినిమాలకు సైన్ చేయకముందే చేశాడు దేవరకొండ. గోలీసోడా ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని శశిధర్ మర్రి డైరెక్ట్ చేయగా విజయ్ కు జోడీగా శివానీ సింగ్ నటించింది.

 
Like us on Facebook