ట్రెండింగ్ లో విజయ్ దేవరకొండ మ్యూజిక్ వీడియో !

ట్రెండింగ్ లో విజయ్ దేవరకొండ మ్యూజిక్ వీడియో !

Published on Nov 22, 2018 8:00 PM IST

vijay

విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ యూత్ ఐకాన్ అనే చెప్పాలి. తాజాగా ‘టాక్సీవాలా’ చిత్రం కలెక్షన్స్ తో బాక్సాఫీస్‌ వద్ద తన స్టార్ డమ్ ఏంటో చూపించుకున్నాడు. అయితే విజయ్‌ దేవరకొండ క్రేజ్ థియేటర్లలతో పాటు.. యూట్యూబ్ లోనూ హల్‌చల్‌ చేస్తోంది. విజయ్‌ తాజాగా.. ‘‘నీ వెనకాలే నడిచి’’ అంటూ సాగే ఓ మ్యూజికల్‌ వీడియోలో నటించాడు.

ఈ పాటలో విజయ్‌ దేవరకొండ సరసన మలోబికా బెనర్జీ నటించింది. లేడీ దర్శకురాలు ‘భానుశ్రీ తేజ తెరకెక్కించిన ఈ పాటకు కేవలం మూడు రోజుల్లో ఒక మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది.

సౌరభ్ – దుర్గేష్ ఈ “నీ వెనకలే నడిచి” పాటను చక్కని రొమాంటిక్ ఫీల్ తో తీర్చిదిద్దారు. అలాగే రచయిత అనంత శ్రీరామ్ ఈ పాటకు మంచి సాహిత్యాన్నిఅందించగా.. చిన్మయి మధురమైన తన గానంతో ఆలపించారు. ఇక సూర్య కెమెరా పనితనం ప్రతి ఫ్రేమ్‌లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పాట నెటిజన్లను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ పాటకు యూట్యూబ్‌లో విశేషమైన స్పందన లభిస్తోంది.

ముఖ్యంగా ఈ పాటలో విజయ్‌ దేవరకొండ -మలోబికా బెనర్జీ మధ్య కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది. అదే విధంగా విజయ్‌ – మలోబికా జోడీ రాయల్‌ ఎన్ఫీల్డ్‌ బైక్‌ పై షికారు చేసే సన్నివేశాలు, సముద్ర తీరానా ఏకాంతంగా గడుపుతున్న దృశ్యాలు, అలాగే విజయ్‌ ఉంగరంతో మోకాలి పై కూర్చుని మలోబికాకు ప్రపోజ్‌ చెయ్యటం లాంటి దృశ్యాలు చాలా బాగున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు