ఇంటర్వ్యూ: విజయ్ దేవరకొండ – నేనుప్పుడూ ఒకేలా ఉండను !

ఇంటర్వ్యూ: విజయ్ దేవరకొండ – నేనుప్పుడూ ఒకేలా ఉండను !

Published on May 8, 2018 3:17 PM IST

‘అర్జున్ రెడ్డి’ సక్సెస్ తో వరుస సినిమాలు చేస్తున్న హీరో విజయ్ దేవరకొండ తన సినిమాల విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

వ్యక్తిగా ఎప్పుడూ ఒకేలా ఉంటారా లేకపోతే మారుతుంటారా ?
ఎస్.. మారుతుంటాను. ఎప్పుడూ ఒకేలా ఉంటే కుదరదు. ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్టు మారుతూ ఉండాలి.

‘అర్జున్ రెడ్డి’ సక్సెస్ మీలో ఎమన్నా మార్పులు తెచ్చిందా ?
‘అర్జున్ రెడ్డి’ సక్సెస్ తర్వాత స్క్రిప్ట్స్ ఎంచుకోవడంలో యాటిట్యూడ్ కొంత మార్చాను.

‘మహానటి’లో నటించే అవకాశం ఎప్పుడు వచ్చింది ?
‘అర్జున్ రెడ్డి’ తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేస్తున్నపుడు స్వప్న ఫోన్ చేసి సినిమా గురించి చెప్పింది. వెంటనే ఒప్పుకున్నాను.

సమంతలాంటి స్టార్ నటితో నటించడం ఎలా ఉంది ?
సరదాగా అనిపించింది. ఆమె చాలా హుషారుగా, ఎప్పుడూ జోక్స్ వేస్తూ ఉంటారు.

తమిళంలో సినిమాలు చేస్తున్నారు. హిందీలో కూడా చేస్తారా ?
తమిళం అంటే కొంచెం కష్టమైనా మన సినిమాలు వాళ్ళ సినిమాలు దగ్గరగా ఉంటాయి కాబట్టి వర్కవుట్ అవుతుంది. కానీ హిందీ అలా కాదు. పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నేను చేసే ప్రతి సినిమా తెలుగులో రావాల్సిందే. కానీ హిందీ, తెలుగులో ఒకేసారి సినిమా చేయడం కుదరదు.

‘మహానటి’లో జెమినీ గణేశన్ పాత్ర కోసం మిమల్ని కూడ సంప్రదించారట కదా ?
అవును. మొదట దుల్కర్ ని అడిగితే అతని డేట్స్ కుదరలేదు. అందుకే నాగి నన్ను చేయమన్నాడు. నాకేమో చేయగలనా లేదా అనే భయం ఉండేది. ఎలాగైనా చేసేయాలి అనుకున్నా. మళ్ళీ దుల్కర్ ఒప్పుకోవడం వలన నేను తప్పించుకున్నాను.

‘టాక్సీవాలా’ ఎలా ఉండబోతోంది ?
చాలా బాగుంటుంది. ఒక టాక్సీ డ్రైవర్ ను తీసుకెళ్లి రకరకాల పరిస్థితుల్లో పడేస్తే అతని కథ ఎలా ఉంటుంది అనేదే సినిమా.

‘అర్జున్ రెడ్డి’ తమిళం, హిందీలో రీమేక్ అవుతోంది కదా.. మీ ఫీలింగ్ ?
నాక్కూడా ఎలా ఉంటుందో, ధృవ్ విక్రమ్, షాహిద్ కపూర్ లు ఎలా చేశారో చూడాలని ఆసక్తిగా ఉంది.

‘నోటా’లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?
‘నోటా’లో కొంచెం యాంగ్రీగా కనిపిస్తాను. ఈ సినిమా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఆధారంగా తీస్తున్నదని వార్తలొచ్చాయి. కానీ ఇదొక ఫిక్షనల్ స్టోరీ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు