తమ్ముడి సినిమా పై విజయ్ దేవరకొండ స్పందన !

Published on Nov 22, 2020 10:02 pm IST

ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన తాజా సినిమా “మిడిల్ క్లాస్ మెలోడీస్”. తెలుగు ఫ్యామిలీ కామెడీ-డ్రామాగా వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ మరియు వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో నటించారు. పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులును బాగా మెప్పించింది. ఈ సినిమాకి మంచి రివ్యూలు, ప్రశంసలు దక్కడంతో విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని ఓ లెటర్ ద్వారా తెలియజేశాడు. విజయ్ దేవరకొండ ఈ రోజు సోషల్ మీడియాలో తన తమ్ముడు రెండో చిత్రం గురించి పెద్ద లెటర్ పోస్ట్ చేశాడు.

లెటర్ లో “మిడిల్ క్లాస్ మెలోడీస్” సినిమా తీసిన దర్శకుడు వినోద్ ని అతని దర్శకత్వ పనితనాన్ని విజయ్ బాగా మెచ్చుకున్నాడు. అలాగే, ఈ సినిమా డైలాగ్ రైటర్ జనార్దన్ గురించి, ముఖ్యంగా హీరో తండ్రి పాత్ర పోషించిన గోపరాజు రమణ నటన గురించి.. ఇక హీరోయిన్ వర్ష బొల్లమ్మ గురించి విజయ్ ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసలు కురిపించాడు. ఇక తన తమ్ముడు కథలని ఎంచుకుంటున్న పద్దతిని కూడా పొగిడాడు. విజయ్ దేవరకొండ తన తమ్ముడికి ఒక సలహా ఇస్తూ.. “ఇలాగే కష్టపడు… ఏదైనా అవసరం వస్తే కాల్ చెయ్యు..” అంటూ ఈ కింద లెటర్ ను విజయ్ పోస్ట్ చేశాడు.

సంబంధిత సమాచారం :

More