వచ్చే ఏడాది ప్రపంచానికి మర్చిపోలేనిదిస్తాం… పూరి కి బర్త్ డే విషెస్ తెలుపుతూ విజయ్ వ్యాఖ్యలు!

Published on Sep 28, 2021 4:00 pm IST

పూరి జగన్నాథ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ తనదైన శైలి లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రెండు సంవత్సారాల క్రితం కలిసాం అని, మీరు నాకు దర్శకుడు అయ్యారు, నటుడు గా నాకు చాలా పెద్ద అవకాశం ఇచ్చారు. నా స్నేహితుడు అయ్యారు, సంతోషం మరియు విచారం గా ఉన్న విషయాలను పంచుకోవడానికి, ఇంటికి దూరంగా ఉన్నప్పుడు నా గార్డియన్ అయ్యారు అని అన్నారు. భారీ కలలను పంచుకుంటున్నాం అని అన్నారు. అంతేకాక వచ్చే ఏడాది ప్రపంచానికి మర్చిపోలేనిది ఇస్తాం అని అన్నారు.

ఐ లవ్ యూ పూరి జగన్నాథ్ సర్, జన్మదిన శుభాకాంక్షలు, మీరు ఆరోగ్యం గా ఉంటానని హామీ ఇస్తే, మిమ్మల్ని అలరించడానికి నేను మీకు అండగా ఉంటా అంటూ చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా ఐదు బాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో బాక్సింగ్ లెజెండ్ అయిన మైక్ టైసన్ కీలక పాత్ర లో నటిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో విజయ్ సరసన హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తుంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :