విజయ్ దేవరకొండతో టాలెంటడ్ డైరెక్టర్ !

విజయ్ దేవరకొండతో టాలెంటడ్ డైరెక్టర్ !

Published on Sep 5, 2018 8:55 AM IST

‘పెళ్లి చూపులు’ అంటూ తెలుగు తెర ఫై మెరిసి.. ‘అర్జున్ రెడ్డి’గా స్టార్ స్టేటస్ సంపాదించుకొని.. ‘గీతగోవిందం’తో స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ ఫుల్ క్రేజ్ తో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. దీనికి తోడు గీత గోవిందం సినిమాతో వంద కోట్ల హీరో అయిపోవడంతో స్టార్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు విజయ్ వెంట పడుతున్నారు.

తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం దర్శకుడు మారుతి తన తర్వాత సినిమాని యూవీ క్రియేష‌న్స్‌లో విజయ్ తో చేయ‌బోతున్నాడట. ప్ర‌స్తుతం మారుతి శైల‌జారెడ్డి అల్లుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక మారుతి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. ఆ కామెడీ టైమింగ్ కి, విజయ్ దేవరకొండ ఫెర్ఫామెన్స్ కూడా తోడైతే ఇక హిట్ గ్యారింటీ అని ఫిల్మ్ నగర్ టాక్. మరి 2019 మొదలవ్వబోయే ఈ సినిమాతో మళ్ళీ విజయ్ భారీ హిట్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు