ఆ యంగ్ డైరెక్టర్ తో ‘విజయ్ దేవరకొండ’ ఫిక్సేనా ?

ఆ యంగ్ డైరెక్టర్ తో ‘విజయ్ దేవరకొండ’ ఫిక్సేనా ?

Published on Sep 8, 2019 1:08 PM IST

విజయ్ దేవరకొండ ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు. యువతను టార్గెట్ చేసుకుని ‘హుషారు’ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించి బాక్సాఫీస్ పరంగా హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ శ్రీ హర్ష కోనుగంటి. కాగా హర్ష కోనుగంటితోనే విజయ్ దేవరకొండ తన తరువాత సినిమా దాదాపు ఫిక్స్ అయ్యేలా కనిపిస్తోంది. నిజానికి హర్ష కోనుగంటి మొదటి సినిమా హుషారు గురించి పెద్దగా హడావుడి కనిపించకపోయినా బీసీ సెంటర్ల ప్రేక్షకుల నుండి మాత్రం మంచి రెస్పాన్స్ నే తెచ్చుకుంది ఈ చిత్రం. ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లను రాబట్టి బాగానే లాభాలను గడిచింది. అందుకేనేమో శ్రీ హర్ష కోనుగంటికు విజయ్ తో చేసే అవకాశం వచ్చింది.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం శ్రీ హర్ష, విజయ్ దేవరకొండకి తన కథను వినిపించాడట. ఆ కథ విజయ్ కి కూడా బాగా నచ్చిందట. దాంతో విజయ్ దేవరకొండ సినిమా చెయ్యడానికి అంగీకరించాడని తెలుస్తోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కాకపోతే సినిమా వచ్చే ఏడాది ఉంటుందని సమాచారం. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోతో రెండో సినిమా చేసే అవకాశాన్ని అందుకోవడం.. పైగా ఓ పెద్ద బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉండటంతో శ్రీ హర్ష కోనుగంటి మొత్తానికి మంచి ఆఫర్ పట్టాడని అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. మరి మొదటి సినిమాతోనే సక్సెస్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ రెండో సినిమాతో కూడా సక్సెస్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు