విడుదల తేదీ ఖారారు చేసుకున్న విజయ్ దేవరకొండ చిత్రం !

విడుదల తేదీ ఖారారు చేసుకున్న విజయ్ దేవరకొండ చిత్రం !

Published on Sep 22, 2018 6:52 PM IST

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘నోటా’. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌ రాజా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. అక్టోబర్ 5 వ తేదీన ‘నోటా’ విడుదల కానుంది.

అయితే ఇటీవల రిలీజ్‌ అయిన ఈ చిత్ర టీజర్‌ కు మంచి స్పందన లభించింది. ‘ఇరుముగన్’ ఫెమ్ ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్, సంచనా నటరాజన్ కథానాయికలుగా నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటులు సత్యరాజ్, నాజర్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండటం విశేషం.

ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్న మళ్ళీ కలిసి నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు