ఓరి… మీ అభిమానం ‘బంగారం’గానూ…!

Published on Jun 23, 2019 4:07 pm IST

సినిమా నటులను అభిమానించడంలో భారతీయుల తరువాతే ఎవరైన, అందులోను తమిళులది ప్రధమ స్థానం. అభిమానటుడు కి గుడులు కట్టడం, పూజలు చేయడం లాంటి వల్లమాలిన అభిమానం మనం కేవలం తమిళనాడులోనే చూడగలం. అభిమాన హీరో పుట్టిన రోజుకి రక్తదానం,అన్నదానం చేయడం, ఆసుపత్రిలో రోగులకు పళ్ళు,పాలు పంచడం చూశాం, కానీ తాజా సంఘటన చుస్తే మతిపోవలసిందే.

నిన్న సూపర్ స్టార్ తలపతి విజయ్ 45వ పుట్టినరోజు సంధర్బంగా ఆయన అభిమానులు ఏకంగా బంగారు ఉంగరాలు పంచి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. తమిళనాడులోని వేలూరు పట్టణంలోని బస్టాండ్ లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వీరు విజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. తరువాత అభిమానులంతా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆ రోజు పుట్టిన శిశువులందరికీ ఉంగరాలు, దుస్తులు అందించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది విజయ్ ఫ్యాన్స్ పాల్గొని తమలోని అభిమానాన్నిచాటుకున్నారు.

సంబంధిత సమాచారం :

X
More