‘జన నాయగన్’ టీమ్‌కు విజయ్ సూచనలు..!

‘జన నాయగన్’ టీమ్‌కు విజయ్ సూచనలు..!

Published on Jun 5, 2026 12:30 AM IST

Jana Nayagan

దళపతి విజయ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సోషల్ డ్రామా చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు సంబంధించి కోలీవుడ్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. సెన్సార్ పరమైన చిక్కుల వల్ల ఈ ఏడాది జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. అయితే, ఐదు నెలలు గడుస్తున్నా కొత్త రిలీజ్ డేట్‌పై ఇంకా స్పష్టత రాలేదు. జూన్‌లో విజయ్ బర్త్‌డే కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో హీరో విజయ్ చిత్ర మేకర్స్‌కు ఒక కీలకమైన రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. సినిమా థియేట్రికల్ డీల్స్ అన్నింటినీ రద్దు చేసి, డిస్ట్రిబ్యూటర్లకు అడ్వాన్స్ మొత్తాన్ని రీఫండ్ చేయాలని ఆయన కోరారట. రిలీజ్ డేట్ ఖరారైన తర్వాత, ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఎవరికీ అమ్మకుండా సొంతంగానే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని విజయ్ సూచించినట్లు టాక్. త్వరలోనే డిస్ట్రిబ్యూటర్ల రీఫండ్ ప్రక్రియ పూర్తవుతుందని తమిళ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

హెచ్. వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘జన నాయగన్’ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సెన్సార్ సర్టిఫికేట్ చేతికి వచ్చిన వెంటనే నాన్-థియేట్రికల్ డీల్స్‌పై సరికొత్త అగ్రిమెంట్లు జరగనున్నాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు