విజయ్ 63 డిఫ్రెంట్ గా ఉంటుందట !
Published on Aug 16, 2018 4:00 pm IST

ఇళయదళపతి విజయ్ 63 వచిత్రాన్ని యువ దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్నాడని తెలిసిందే. ఇంతకుముందు వీరిద్దరి కలయికలో వచ్చిన ‘తేరి , మెర్సల్’ చిత్రాల మాదిరిగా కాకుండా ఈ చిత్రం పూర్తిగా కొత్తగా ఉండనుందట. ఈవిషయాన్ని స్వయంగా అట్లీ నే ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించాడు.

ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈచిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రహెమాన్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి. ఈఏడాది చివర్లో ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక విజయ్ ప్రస్తుతం మురుగదాస్ తెరకెక్కిస్తున్న ‘సర్కార్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం దీపావళి కి ప్రేక్షకులముందుకు రానుంది.

  • 5
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook