ఒకప్పుడు హిట్ ఇచ్చాడని ఇప్పుడు ఛాన్స్ ఇచ్చాడు !

Published on Mar 18, 2019 10:24 am IST

‘గుండె జారి గ‌ల్లంత‌య్యిందే’ లాంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు కొండా విజయ్ కుమార్. అయితే ఆ సక్సెస్ ను మాత్రం అలాగే కొనసాగించలేకపోయాడు. నాగచైతన్య పిలిచి మరి ఆఫర్ ఇచ్చినా.. ‘ఒక లైలా కోసం’ అంటూ ప్లాప్ చిత్రాన్ని తీశాడు. దాంతో మొదటి సినిమాకు వచ్చిన పేరు కాస్త పోయింది.

ఇక ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో ఎదురైనా ఇబ్బందుల కారణంగా మొత్తానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు విజ‌య్ కుమార్ కొండా. ఎట్టకేలకూ మళ్లీ తన సినిమాను త్వరగా పట్టాలెక్కించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. తనకు డైరెక్టర్ గా మొదటి అవకాశం ఇచ్చిన హీరో నితిన్ కోసం ఓ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ స్క్రిప్టును రాశాడట.

ఆ స్క్రిప్ట్ ను ఇటీవలే నితిన్ కు కూడా వినిపించినట్లు సమాచారం. కథ న‌చ్చ‌డంతో అలాగే ఒక్కపుడు తనకు హిట్ ఇచ్చాడనే ఉద్దేశ్యంతో నితిన్ సినిమా చేయడానికి అంగీకరించారట. త్వరలోనే ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది. ప్రస్తుతం నితిన్ ఛలో డైరక్టర్ తో ‘బీష్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తరువాత విజయ్ కుమార్ – నితిన్ సినిమా ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం :

More