కన్నడ హీరోతో గుండె జారి .. డైరక్టర్ !

కన్నడ హీరోతో గుండె జారి .. డైరక్టర్ !

Published on Nov 24, 2018 10:27 PM IST

Nikil

నితిన్ తో ‘గుండె జారి గల్లంతయ్యిందే’ చిత్రాన్ని తెరకెక్కించిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు దర్శకుడు విజయ్ కుమార్ కొండా. ఈచిత్రం తరువాత కొంత గ్యాప్ ఇచ్చి నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం కూడా పర్వాలేదనిపించింది.

ఇక దీని తరువాత ఇప్పటివరకు తెలుగులో తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. తాజాగా ఈ దర్శకుడు కన్నడ యువ హీరో నిఖిల్ గౌడ కు కథ చెప్పి సినిమా కు ఒప్పించాడట. తర్వలోనే ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. నిఖిల్ ‘జాగ్వర్’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల పరిచయం కావడంతో ఈచిత్రం కన్నడ తో పాటు తెలుగులో కూడా విడుదల అయ్యే అవకాశాలు వున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు