విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో అల్లు అర్జున్?

విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో అల్లు అర్జున్?

Published on Jan 17, 2015 12:43 PM IST

allu-arjun-vijay-kumar-kond

తన తొలి చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే’ తోనే మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు విజయ్ కుమార్ కొండా. తన తదపరి చిత్రం నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ తీసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ దర్శకుడు ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేయనున్నాడని తెలుస్తుంది.

బన్నీ కి విజయ్ కుమార్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చిందని, త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ మొదలుకానుందని సమాచారం. మరిన్ని వివరాల కోసం మా సైట్ ని చదువుతూ వుండండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు