విజయ్ కొత్త సినిమాకు ముహూర్తం కుదిరింది !
Published on Mar 4, 2018 9:01 am IST

విజయ్ దేవరకొండ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ హీరో ఒప్పుకున్న సినిమాకు తమిళ్ డైరెక్టర్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నాడు. తమిళ్ తెలుగులో నిర్మించబోయే ఈ సినిమాలో మెహరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. రేపు ఈ సినిమా ప్రారంభం హైదరాబాద్ లో జరగనుంది.

ఈ మూవీ లో నటించే నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. విజయ్ నటించిన ఏ మంత్రం వేసావే సినిమా ఈ నెల 8న విడుదలకు సిద్ధంగా ఉంది. కొత్త దర్శకుడు రాహుల్ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. అలాగే సోలో డైరెక్టర్ పరుసురం బుజ్జి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించే ఫ్యామిలి ఎంటర్టైనర్ షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది.

 
Like us on Facebook