ఆ స్టార్ హీరో బర్త్ డేను జరుపుకోవట్లేదు !

ఆ స్టార్ హీరో బర్త్ డేను జరుపుకోవట్లేదు !

Published on Jun 12, 2018 1:49 AM IST

vijay6

తమిళ స్టార్ నటుడు ఇళయదళపతి విజయ్ తన ప్రతి పుట్టిన రోజును జూన్ 22 న ఘనంగా జరుపుకుంటారు . అయన అభిమానులు కూడా ఈ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు . కానీ ఈ సారి విజయ్ తన బర్త్ వేడుకలకు దూరంగా వుండనున్నారని సమాచారం . గత నెల తమిళనాడులోని టుటికోరిన్ జిల్లాలో జరిగిన స్టెరిలైట్ ప్రొటెస్ట్ కాల్పుల్లో 13 మంది చనిపోయిన విషయం తెలిసిందే . ఆ మృతులకు సంతాంపంగా అయన తన 44 వ పుట్టినరోజును జరుపుకోవట్లేదు .

ఇటీవల విజయ్ బైక్ ఫై వచ్చిబాధిత కుటుంబాలను పరామర్శించి తన తరుపున ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇంతకు ముందు కమల్ హాసన్ , రజిని కాంత్ లు కుడా తూత్తుకుడి బాధితులను పరామర్శించారు. రజినీకాంత్ మృతుల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సాయం చేశారు . ఇక ఇంత మంది చావుకు కారణమైన స్టెరిలైట్ కర్మాగారాన్ని తమిళనాడు ప్రభుత్వం శాశ్వతంగా మూసివేసింది .

తాజా వార్తలు