సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పోకిరి సాంగ్.

Published on Aug 14, 2019 3:11 pm IST

తలపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ చిత్రంలోని ఓ తమిళ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. దానికి కారణం అనుకోకుండా ఆ సాంగ్ ఇరాన్ దేశంలో ప్రత్యక్షం కావడమే. అసలు వివరాలలోకెళితే, పోకిరి చిత్రంలోని ‘మామ్ బజా మామ్…మామ్ బజా’ అనే సాంగ్ ఇరాన్ దేశంలోని ఓ జిమ్ సభ్యులు పాటకు తగ్గట్టుగా డాన్స్ చేస్తూ వ్యాయామం చేశారు. పాటను అనుసరిస్తూ వారు చేసిన డాన్స్ తో కూడిన వ్యాయామం చూడడానికి ఆసక్తికరంగా ఉంది. అసలు ఎక్కడో ఇరాన్ దేశంలోని ఓ జిమ్ లో తమిళ సాంగ్ అంత ప్రాచుర్యం పొందటంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఇక ట్విటర్లో రీట్వీట్ లు, లైక్స్ తో సంచలనాలు చేస్తుంది.

మరో విశేషం ఏమిటంటే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్ర ఈ వీడియోని ట్యాగ్ చేసి “నిజంగానా? నేను కూడా రేపటి నుండి తమిళ మ్యూజిక్ తో నా రోజు ప్రారంభించి, ఆ రోజు సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధం అవుతాను” అంటూ ట్వీట్ చేశారు. తెలుగులో సంచలన విజయం సాధించిన పోకిరి సినిమాను తమిళంలో ప్రభుదేవా అదే పేరుతో విజయ్ హీరోగా తెరకెక్కించారు. ఆ మూవీలోదే ఈ ‘మామ్ బజా మామ్…మామ్ బజా’ సాంగ్. ఐతే ఈ మూవీ తమిళ సాంగ్ అయినప్పటికీ దీనిని స్వరపరచింది తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కావడం గమనార్హం.

సంబంధిత సమాచారం :