సెటైర్లు వేసుకుంటూ ప్రమోషన్లు చేస్తున్న దేవరకొండ, రష్మిక !
Published on Jun 23, 2018 4:24 pm IST

సినిమా విజయంలో ప్రమోషన్లు కూడ చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. అందుకే హీరో హీరోయిన్లు సినిమాలో నటించడం మాత్రమే గాక ప్రమోషన్లను కూడ ఒక భాద్యతగా భావించి తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఒక్కొక్క సినిమా టీమ్ తన సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ఒక్కో రకం కొత్త పద్ధతిని కనుగొంటోంది.

తాజాగా ‘గీత గోవిందం’ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నలు పాత పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్తగా ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ సోషల్ మీడియాలో ప్రేక్షకుల్ని తెగ ఎంటర్టైన్ చేస్తున్నారు. తమ సినిమా థీమ్ ప్రకారం హీరో హీరోయిన్ ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ హీరోయిన్ మాత్రం అతన్ని దూరం పెడుతుంటుంది.

ఈ థీమ్ కు అనుగుణంగానే ట్విట్టర్లో విజయ్ సినిమాకు సంబందించిన ఒక పోస్టర్ ను షేర్ చేసి రష్మికను ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశ్యంతో ట్వీట్ చేయడం, దానికి రష్మిక కొంత ఘాటుగా, వెటకారంగా సమాధానం ఇవ్వడం, ఇలా వారి మధ్య కాసేపు ఆసక్తికరమైన సంభాషణ జరగడం వలన సినిమాపై ప్రేక్షకుల్లో మెల్లగా అటెంక్షన్ నెలకొంటోంది. ఇలా గీత, గోవిందంలు వేసిన కొత్త ప్లాన్ బాగానే వర్కవుట్ అవుతోంది.

పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాస్ నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. గోపి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook