మాసివ్ రికార్డ్ సెట్ చేసిన విజయ్ “బీస్ట్” ఫస్ట్ లుక్.!

Published on Jul 15, 2021 9:00 pm IST

ఇళయ థలపతి విజయ్ జోసెఫ్ హీరోగా పూజా హీరోయిన్ గా నటిస్తన్న లేటెస్ట్ చిత్రం “బీస్ట్”. కోలీవుడ్ స్టార్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి టాక్ తో సంబంధం లేకుండా భారీ స్థాయి రెస్పాన్స్ వచ్చింది.

మామూలుగానే విజయ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. అది మళ్ళీ బీస్ట్ ఫస్ట్ లుక్ కి రిపీట్ అయ్యి ఇండియాలోనే హైయెస్ట్ లైక్డ్ ఫస్ట్ లుక్ పోస్టర్ గా రికార్డు సెట్ చేసింది. విజయ్ లాస్ట్ సినిమా మాస్టర్ పేరిట ఉన్న రికార్డును బీస్ట్ తో ఏకంగా 3 లక్షల 13 వేలకు పైగా లైక్స్ తో తన రికార్డును తానే బద్దలుకొట్టుకొని కొత్త రికార్డును విజయ్ సెట్ చేసి పెట్టాడు. ఇక ఈ చిత్రానికి కూడా అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :