విజయ్ ‘సర్కార్’ థియేట్రికల్ హక్కుల కోసం భారీ పోటీ !

విజయ్ ‘సర్కార్’ థియేట్రికల్ హక్కుల కోసం భారీ పోటీ !

Published on Jul 4, 2018 3:00 PM IST

Sarkar4

మురగదాస్ దర్శకత్వంలో ఇళయ దళపతి నటిస్తున్న 62 వ చిత్రం ‘సర్కార్’ . ఇటీవల విడుదలైన ఈ చిత్ర టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. ఈ చిత్రా హక్కుల కోసం 105 కోట్లు చెల్లించడానికి రెడీగా ఉన్నారట. ఫైనల్ గా ఈ రేటు కాస్త 120 కోట్ల దాకా వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విజయ్ కి వున్నా ఫాలోయింగ్ దృష్ట్యా భారీ మొత్తాన్ని చెల్లించడానికి సిద్దమవుతున్నారట డిస్ట్రిబ్యూటర్స్. గతంలో విజయ్ నటించిన ‘మెర్సల్’ చిత్రం కూడా 100 కోట్ల పైనే బిజినెస్ చేసింది.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు . వరలక్ష్మి శరత్ కుమార్ , యోగి బాబు మొదలగువారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా దీపావళి కి విడుదల కానుంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు