విజయ్ ‘సర్కార్’ కు లీకులు తప్పడం లేదు !

విజయ్ ‘సర్కార్’ కు లీకులు తప్పడం లేదు !

Published on Aug 12, 2018 11:21 PM IST

ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న 62 వ చిత్రం ‘సర్కార్’ చిత్రంలోని లాస్ వేగాస్ లో చిత్రీకరించిన ఒక సాంగ్ లోని కొన్ని దృశ్యాలు నెట్లో ప్రత్యక్షమయ్యాయి.ప్రముఖ డాన్స్ మాస్టర్ శోభి నేతృత్వంలో తెరకెక్కిన ఈ సాంగ్ ఎలా లీకయిందో అర్థంకాక తల పట్టుకుంది చిత్ర యూనిట్. మురగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ , వరలక్ష్మి శరత్ కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు