స్టార్ హీరోకి విలన్ గా మరో స్టార్ హీరో !

స్టార్ హీరోకి విలన్ గా మరో స్టార్ హీరో !

Published on Oct 1, 2019 1:04 AM IST

thalapathi

తమిళ స్టార్ హీరో విజయ్ తరువాత సినిమాలో మరో స్టార్ కూడా నటిస్తున్నారు. విజయ్‌ సేతుపతి, విజయ్ సినిమాలో విలన్‌ క్యారెక్టర్‌ ను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షూటింగ్‌ లో జాయిన్‌ అయినట్లు చిత్రబృందం అధికారికంగా పోస్టర్‌ ను కూడా విడుదల చేసింది. కాగా ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. అయితే ప్రస్తుతం విజయ్ హీరోగా రాజా రాణి ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘బిగిల్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పై అభిమానుల్లో విపరీతమైన అంచనాలున్నాయి.

ఇది వ‌ర‌కు అట్లీ – విజయ్ కాంబినేష‌న్‌లో విడుద‌లైన తెరి(పోలీస్‌), మెర్స‌ల్‌(అదిరింది) చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ చిత్రంగా బిగిల్‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. న‌య‌న‌తార హీరోయిన్‌ గా న‌టిస్తోన్న‌ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకం పై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భ‌గా తెలుగు, త‌మిళంలో ఈ సినిమాను ఏక కాలంలో విడుద‌ల చేస్తున్నారు. ఇక విజయ్‌ సేతుపతి కూడా సైరా సినిమాతో అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు