కమల్ హాసన్ సినిమాకు సైన్ చేసిన విజయ్

Published on May 18, 2021 12:00 am IST

కమల్ హాసన్ సైన్ చేసిన కొత్త చిత్రం ‘విక్రమ్’. ‘మాస్టర్’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం మీద దక్షిణాది ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు లోకేష్ కనగరాజ్.
పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. ఇందులో ప్రధాన ప్రతినాయకుడి విషయంలో మొదటి నుండి పెద్ద చర్చే నడుస్తోంది. మొదట్లో విజయ్ సేతుపతి పేరు గట్టిగా వినబడినా తర్వాత ఫహాద్ ఫాజిల్ తెర మీదకు వచ్చారు. ఆయన సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయింది.

ఆయన చేయబోయేది విలన్ పాత్రేనని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు విజయ్ సేతుపతి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ప్రధాన ప్రతినాయకుడిగా ఆయనే ఫైనల్ అయ్యారు. లోకేష్ కనగరాజ్ జరిపిన పలు చర్చల అనంతరం సేతుపతి సినిమాకు ఒప్పుకోవడం జరిగింది. దీంతో కమల్ హాసన్ ను ఢీకొట్టబోయేది విజయ్ సేతుపతేనని తెలిపిపోయింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

సంబంధిత సమాచారం :