టాలీవుడ్ లో మక్కల్ సెల్వన్ అంత డిమాండ్ చేస్తున్నాడా?

Published on May 22, 2020 11:33 pm IST

ఎలాంటి పాత్రలో అయినా యిట్టె ఒదిగిపోయే నటులలో తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ఒకరు. కేవలం హీరోగానే కాకుండా పాత్ర డిమాండ్ మేరకు ఇతర రోల్స్ లో కూడా నటిస్తారు. ఆ విధంగానే మెగాస్టార్ చిరంజీవితో “సైరా” లాంటి ఎపిక్ వండర్ లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో పరిచయం అయ్యారు.

అంతకు మునుపే టాలీవుడ్ ఆడియన్స్ కు పరిచయం అయినా సైరా తో మంచి గుర్తింపు వచ్చింది. దానితో విజయ్ సేతుపతికి మన మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. అందులో భాగంగానే పలు చిత్రాల్లో మంచి ఆఫర్స్ కూడా సొంతం చేసుకున్నారు.

దీనితో విజయ్ సేతుపతి భారీ గానే డిమాండ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. వినిపిస్తున్న టాక్ ప్రకారం విజయ్ సేతుపతి 10 వరకు డిమాండ్ చేస్తున్నారట. సేతుపతి ఇటీవలే తెలుగులో నటించిన “ఉప్పెన” చిత్రాన్ని తమిళ్ లో రీమేక్ నిర్మించనున్నారన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More