విజయ్ సేతుపతి భారీ విరాళం

Published on Jun 15, 2021 5:00 pm IST

కరోనా సెకండ్ వేవ్ దేశంలోని పలు రాష్ట్రాలను తీవ్రంగా వణికించింది. మరణాల రేటు విపరీతంగా పెరగడంతో రాష్ట్రాలే స్వయంగా లాక్ డౌన్ విధించుకుంటున్నాయి. తమిళనాడు రాష్ట్రం చాలా రోజుల నుండి లాక్ డౌన్ పాటిస్తోంది. ఇప్పుడిప్పుడే కేసులు అదుపులోకి వస్తున్నాయి. అయితే ఈ లాక్ డౌన్ ప్రభావంతో చాలామంది రోజు కూలీల జీవనం దుర్భరమైంది. సహాయ కోసం వేలమంది ఎదురుచూస్తున్నారు. దీంతో తమిళ సినీ తారలు ఒక్కొక్కరిగా ముందుకొచ్చి భారీ మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు.

తాజాగా ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కల్సి చెక్ అందజేశారు విజయ్ సేతుపతి. ఆయన సహాయానికి గాను అభిమానులు కృతజ్ణతలు తెలుపుతున్నారు. విజయ్ సేతుపతి ప్రస్తుతం తమిళంలోనే కాదు తెలుగులో కూడ పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :