“జైలర్ 2″లో మక్కల్ సెల్వన్.. కేవలం సూపర్ స్టార్ కోసమే!

Vijay-sethupathi-and-jailer

ప్రస్తుతం దక్షిణాది సినిమా నుంచి ఆడియెన్స్ ఎంతో ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్న చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న మాస్ మల్టీస్టారర్ చిత్రం జైలర్ 2(Jailer 2) కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కోసెం అభిమానులు ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే ఈ సినిమాలో విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ఉన్నట్లు కన్ఫర్మ్ చేసాడు.

తను కామియో రోల్ చేశానని అది కూడా కేవలం రజినీకాంత్ గారు ఒక్కరి కోసమే చేసినట్టు తను తెలిపారు. అయితే విజయ్ సేతుపతి ఇది వరకు కొన్ని సినిమాల్లో విలన్ గా కీలక పాత్రలు కూడా చేసాడు కానీ తర్వాత చేయనని చెప్పేసాడు. కానీ ఇది మాత్రం కేవలం రజినీకాంత్ కోసమే చేశానని ఈ ప్రాసెస్ లో తను చాలా నేర్చుకున్నట్టు తెలిపాడు. సో ఈ క్రేజీ సీక్వెల్ లో విజయ్ సేతుపతి కూడా ఉన్నాడని చెప్పాలి.

Exit mobile version