‘పెటా’ నుండి విజయ్ సేతుపతి పోస్టర్ విడుదల కానుంది !

‘పెటా’ నుండి విజయ్ సేతుపతి పోస్టర్ విడుదల కానుంది !

Published on Dec 4, 2018 3:14 PM IST

Vijay Sethupathi

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెటా’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈచిత్రం యొక్క విడుదలకు సమయం దగ్గర పడుతుండండంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ అవుతుంది చిత్ర బృందం. దాంట్లో భాగంగా ఈచిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్న ప్రముఖ హీరో విజయ్ సేతుపతి పాత్ర కు సంబందించిన పోస్టర్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదలచేయనున్నారు. ఇక ఈచిత్రం యొక్కఆడియో విడుదల వేడుక డిసెంబర్ 9న చెన్నై లో గ్రాండ్ గా జరుగనుంది . పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈచిత్రంలో సిమ్రాన్ , త్రిష , మెగా ఆకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ‘జిగర్తాండ’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో పొంగల్ కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు