చివరి నిమిషంలో రిలీజ్ కి బ్రేక్

Published on Nov 15, 2019 10:55 am IST

టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి నటించిన తమిళ చిత్రం సంఘ తమిజాన్. తెలుగులో విజయ్ సేతుపతి పేరుతో హర్షిత మూవీస్ బ్యానర్ పై రావూరి వి శ్రీనివాస్ విడుదల చేస్తున్నారు. విజయ్ రెండు భిన్న పాత్రలలో నటిస్తుండగా ఈ మూవీని నేడు విడుదల కానుంది. ఐతే తాజా సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి చిత్రం నేడు విడుదల కావడం లేదు.

విడుదల చివరి నిమిషంలో తలెత్తిన ఫైనాన్సియల్ ఇబ్బందుల కారణంగా ఈ మూవీ రెండు భాషలలో విడుదల వాయిదాపడిందని సమాచారం. దీనితో విజయ్ సేతుపతి అభిమానులు నిరుస్తాహం చెందుతున్నారట. విజయ్ సేతుపతి చిత్రాన్ని విజయ్ చందర్ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. రాశిఖన్నా, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు.

సంబంధిత సమాచారం :

X
More