సమంత – నయనతార సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Aug 23, 2021 7:18 am IST

అక్కినేని సమంత ప్రస్తుతం గుణశేఖర్ ‘శాకుంతలం’లో నటిస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా సినిమా. అన్నట్టు ఈ సినిమా షూటింగ్ ను సామ్ చాలా స్పీడ్ గా పూర్తి చేసింది. ప్రస్తుతానికి అయితే సామ్ మరో సినిమా షూట్ లో బిజీగా ఉంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది. విజయ్ సేతుపతి హీరో, సమంత నయనతార హీరోయిన్లుగా ఈ సినిమా రానుంది.

దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. పైగా నయనతారనే నిర్మాత. జనవరిలో హైదరాబాద్ లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది. దాదాపు నెల రోజులు పాటు షూట్ చేశారు. ఆ తరువాత మళ్ళీ గత వారమే షూట్ స్టార్ట్ చేశారు. కాగా కేరళలో జరుగుతునన్న ఈ షెడ్యూల్ షూట్ నేటితో ముగియబోతునట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :