ఆ స్టార్ డైరెక్టర్‌తో విజయ్ సేతుపతి, సాయి పల్లవి మూవీ.. నిజమేనా..?

ఆ స్టార్ డైరెక్టర్‌తో విజయ్ సేతుపతి, సాయి పల్లవి మూవీ.. నిజమేనా..?

Published on Feb 23, 2026 5:00 PM IST

Vijay Sethupathi Sai Pallavi

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘థగ్ లైఫ్’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత మణిరత్నంపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినప్పటికీ, ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు. మొదట ధ్రువ్ విక్రమ్, రుక్మిణి వసంత్ జంటగా ఒక ప్రేమకథను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం మణిరత్నం తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, మణిరత్నం తన నెక్స్ట్ చిత్రంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి మరియు స్టార్ బ్యూటీ సాయి పల్లవిలను ప్రధాన పాత్రలకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మణిరత్నం మార్క్ మ్యాజికల్ లవ్ స్టోరీలకు పెట్టింది పేరు. మరి అద్భుతమైన నటులైన విజయ్ సేతుపతి, సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే ఆ మ్యాజిక్ మరో స్థాయిలో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ కాంబినేషన్ వినడానికే చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది.

ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయని టాక్. అంతా అనుకున్నట్లు జరిగితే, ఈ ఏడాది వేసవిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి ‘పాకెట్ నావెల్’ అనే చిత్రంలో బిజీగా ఉండగా, సాయి పల్లవి ‘రామాయణం’ సినిమాలో నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు