కాకరేపుతున్న సూపర్ స్టార్ విజయ్ “బిజిల్” మూవీ ఫస్ట్ లుక్

Published on Jun 22, 2019 9:11 am IST

సూపర్ స్టార్ తలపతి విజయ్ తన 45వ పుళ్ళినరోజు నేడు జరుపుకుంటున్నాడు. ఈసందర్భంగా ఈ అర్థరాత్రి ప్రస్తుతం ఆయన నటిస్తున్న కొత్త మూవీ టైటిల్ తోపాటు ఆయన లుక్ ని రివీల్ చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేసారు.యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి “బిజిల్” అనే టైటిల్ నిర్ణయించారు.ఇక మూడు వైవిధ్యమైన గెట్ అప్స్ లో విజయ్ లుక్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో పెంచేలా ఉంది.

లుంగీ కట్టుకొని కత్తి పట్టుకున్న మాస్ లుక్, ఫుట్ బాల్ తో స్పోర్ట్స్ వేర్ లో స్పోర్ట్స్ మెన్ లుక్, ఎంప్లాయి గెట్ అప్ లో క్లాస్ లుక్ ఇలా మూడు విభిన్న అవతారాలలో కనిపిస్తున్న విజయ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. డైరెక్టర్ అట్లీ విజయ్ తో చేసిన గత చిత్రం “అదిరింది” లో తండ్రిగా, డాక్టర్గా, కిల్లర్ గా ఆయన్ని చూపించి విజయ్ ఫాన్స్ కి మంచి ట్రీట్ అందించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మరి తాజా చిత్రం “బిజిల్”లో విజయ్ ది ట్రిపుల్ రోలా లేకా ఒక్కడే వివిధ విభిన్న గెట్ అప్స్ లో కనిపిస్తారా తెలియాల్సిఉంది

సంబంధిత సమాచారం :

More