‘జన నాయగన్’ పై విజయ్ స్ట్రిక్ట్ రూల్స్..?

Jana Nayagan

తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్, పరిపాలన పరంగా తనదైన ముద్ర వేస్తూ బలమైన నాయకుడిగా దూసుకుపోతున్నాడు. ఆయన రాజకీయ ప్రస్థానం అద్భుతమైన విజయాలతో సాగుతున్నప్పటికీ, సినీ కెరీర్ మాత్రం కాస్త ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ చిత్రం ‘జననాయగన్’ ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఒకవైపు అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటే, మరోవైపు ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రం విజయ్‌ను దెబ్బతీయడానికి ఇదే సరైన అవకాశంగా భావిస్తున్నారు.

ఈ సినిమా విడుదలలో టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ లేదా అదనపు ధరల వసూళ్లు వంటి చిన్న పొరపాటు జరిగినా, విజయ్ అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షాలు తక్షణమే ఆరోపణలు గుప్పించే అవకాశం ఉంది. ఈ సున్నితమైన పరిస్థితిని ముందుగానే గ్రహించిన ముఖ్యమంత్రి విజయ్, గట్టి నిఘా చర్యలకు పూనుకున్నాడు. థియేటర్లపై ఆకస్మిక దాడులు నిర్వహించాలని, అనుమతించిన ధరల కంటే ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా థియేటర్ లైసెన్సులను రద్దు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.

సినిమా ఫలితం ఎలా ఉన్నా, టికెట్ల ధరల వివాదం తలెత్తితే అది నేరుగా విజయ్ రాజకీయ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఆయన అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ తరుణంలో విజయ్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా, విడుదల ప్రక్రియ మొత్తాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ పైనే ఉంది.

Exit mobile version