‘టాక్సీవాలా’పై విజయ్ సూపర్ కాన్ఫిడెంట్ !

‘టాక్సీవాలా’పై విజయ్ సూపర్ కాన్ఫిడెంట్ !

Published on Aug 15, 2018 4:01 PM IST

విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం ఫై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పటివరకు విడుదలకాకపోగా అసలు దానికి సంభదించిన వార్తలు కూడా ఎక్కడ వినపడట్లేదు. దాంతో ఈ సినిమా విడుదలవడం కష్టమే అనే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమావిడుదలపై క్లారిటీ ఇచ్చారు హీరో విజయ్ దేవరకొండ. వి ఎఫ్ ఎక్స్ పనుల్లో జాప్యం వల్లే ఈ సినిమా వాయిదా పడుతుందని ఇంతకుముందు చేసిన వర్క్ తమకు నచ్చలేదని దాంతో ఇప్పుడు మంచి క్వాలిటీ తో ఆ పనిని పూర్తి చేపిస్తున్నామని అందుకే ఆలస్యం అవుతుందని త్వరలోనే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని అన్నారు. అలాగే ఈసినిమా ఎప్పుడొచ్చినా హిట్ అవుతుందని విజయ్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు.

ఇక పరుశురాం దర్శకత్వంలో ఆయన నటించిన ‘గీత గోవిందం’ ఈ రోజు విడుదలై అద్భుతమైన రివ్యూస్ ను సాధించింది. ఈచిత్రం తో విజయ్ మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు