తర్వాత రెండు సినిమాలకు దర్శకులను ఫైనల్ చేసుకున్న స్టార్ హీరో

తర్వాత రెండు సినిమాలకు దర్శకులను ఫైనల్ చేసుకున్న స్టార్ హీరో

Published on Feb 16, 2021 1:08 AM IST

Vijay 1

స్టార్ హీరోలు ఈమధ్య వేగం పెంచారు. గతంలో ఒక సినిమా చేస్తుంటే తరవాతి సినిమా గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుడు మాత్రం ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద గట్టిగా దృష్టిపెడుతున్నారు. ప్రతి హీరోకు తర్వాతి సినిమాను ఎవరితో చేయాలనేది క్లారిటీ ఉంది. తమిళ స్టార్ హీరో విజయ్ కూడ అలాగే ఉన్నారు. ఆయన ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలకు దర్శకులను ఫైనల్ చేసి పెట్టుకున్నారట.

ప్రస్తుతం విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా పూర్తికాకముందే తన 66వ సినిమాకు దర్శకుడిగా ‘మాస్టర్’ ఫేమ్ లోకేష్ కానగరాజ్ పేరును ఫైనల్ చేసుకున్నారట. ‘మాస్టర్’ విషయంలో లోకేష్ పనితనం నచ్చి ఇంకొక ఆఫర్ ఇచ్చారు ఆయన. అలాగే 67వ సినిమాను అట్లీ దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నారట. అట్లీ, విజయ్ కాంబినేషన్ చాలా విజయవంతమైన కాంబినేషన్. వరుసగా ‘థేరీ, మెర్సల్, బిగిల్’ లాంటి సూపర్ హిట్లు ఇచ్చారు. ఆ నమ్మకంతోనే అట్లీతో నాల్గవసారి సినిమా చేయడానికి రెడీ అయ్యారట విజయ్. ఈ రెండు సినిమాల్లో 66వ చిత్రాన్ని ప్రముఖ తెలుగు నిర్మాణ సామ్సతః నిర్మించనుందని తెలుస్తోంది. ‘మాస్టర్’ విజయంతో విజయ్ సినిమాలు మీద తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు