యువ దర్శకులకు హీరో విజయ్ బంపర్ ఆఫర్ !

Published on May 13, 2019 3:34 pm IST

తమిళ స్టార్ హీరో విజయ్‌తో సినిమా చేయాలని స్టార్ దర్శకులతో పాటు చాలామంది యువ దర్శకులు కోరుకుంటుంటారు. వాళ్ళలో విజయ్ కోసమే ప్రత్యేకంగా కథల్ని రాసుకుని పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ విజయ్ మాత్రం నమ్మకమున్న, ఆల్రెడీ నిరూపించుకున్న దర్శకులతో మాత్రమే పనిచేస్తుంటారు. ఇన్నాళ్లు ఇదే ఫార్ములాను ఫాలో అయిన అయన ఇకపై పద్దతి మార్చాలనుకుంటున్నారు. తన సినిమాల్లో కొత్తదనం కోసం కొత్త తరం దర్శకులతో పనిచేయాలని అనుకుంటున్నారట.

ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా పూర్తవగానే నూతన దర్శకుల నుండి కథలు వింటారట ఆయన. వాటిలో ఏ దర్శకుడైతే కథతో తనను మెప్పించి, నమ్మకం కలిగేలా చేస్తాడో అతనితో పనిచేస్తాడట విజయ్. ఈ వార్త తెలిసిన కోలీవుడ్ యువ దర్శకులంతా విజయ్ కోసం రాసుకున్న కథల్ని బయటికి తీసి ఆయన్ను కలిసే ప్రయత్నాల్లో ఉన్నారట.

సంబంధిత సమాచారం :

More