సీనియర్ నటి విజయనిర్మల హఠాన్మరణం -రేపు అంత్యక్రియలు

Published on Jun 27, 2019 7:47 am IST

సీనియర్ నటి విజయనిర్మల రాత్రి గచ్చిబౌలిలో గల కాంటినెంటల్ హాస్పిటల్ తుదిశ్వాస విడిచారు. ఈ హఠాత్ పరిణామంతో కుటుంబ సభ్యులతో పాటు,చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్బ్రాంతి గురైంది.ఈ రోజు 11 గంటలకు నానక్ రామ్ గూడా లోని ఆమె స్వగృహానికి మృత దేహాన్ని తీసుకువచ్చిన అనంతరం అభిమానుల సందర్శనార్ధం ఫిలిం ఛాంబర్లో ఉంచి,రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

తెలుగు తెరపై హీరోయిన్ పాత్రకు హీరోయిజాన్ని పరిచయం చేసిన నటి విజయనిర్మల. తెలుగు పరిశ్రమలో హీరోయిన్ పాత్రంటే ఇలానే ఉండాలి, అనే సంప్రదాయాన్ని బద్దలుకొట్టి హీరోయిన్ పాత్రకు కొత్త భాష్యం చెప్పారు. లేడీ ఓరియెంట్ సినిమాలకు మార్గదర్శిగా ఆమెను చెప్పుకోవచ్చు. అప్పటివరకు అగ్ర హీరోలు కూడా చేయని ప్రయోగాత్మక పాత్రలలో విజయనిర్మల నటించారు. నటిగానే కాక దర్శకురాలిగా తెలుగు తెరపై తనదంటూ ముద్ర వేశారు. ఏకంగా 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.దర్శకురాలిగానే గాక పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.

1946 ఫిబ్రవరి 20న చెన్నైలో పుట్టిన విజయనిర్మల 1950లో బాలనటిగా తమిళ చిత్రంలో మొదటిసారి నటించారు. 11ఏళ్ల వయసులో ‘పాండురంగ మహత్యం’ చిత్రంతో తెలుగులో పరిశ్రమలో అడుగుపెట్టారు. చంద్రమోహన్ హీరోగా బి.ఎన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన “రంగులరాట్నం” చిత్రంతో హీరోయిన్ గా మొదలైన ఆమె సినీ ప్రస్థానం దశాబ్దాల పాటు విజయవంతంగా కొనసాగింది. మొదటి భర్తతో విడాకుల తరువాత హీరో కృష్ణను వివాహం చేసుకున్నారు. యాక్టర్ నరేష్ ఆమె కుమారుడు.

సంబంధిత సమాచారం :

X
More