మహేష్ మూవీలో తన పాత్రపై విజయశాంతి క్లారిటీ ఇచ్చేశారు.

Published on Jun 23, 2019 10:06 am IST

లేడి అమితాబ్ విజయశాంతి చాలా కాలం తరువాత మళ్ళీ మహేష్ హీరోగా తెరకెక్కుతున్న “సరిలేరు నీకెవ్వరూ” మూవీతో కెమెరా ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో 2006లో వచ్చిన ‘నాయుడమ్మ’ చిత్రం తరువాత ఆమె మళ్ళీ ఏసినిమాలో నటించడానికి ఆసక్తి చూపించలేదు. దశాబ్దాలపాటు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన విజయశాంతి రేపు సోమవారం తన 53వ జన్మదినం జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న విజయశాంతి “సరిలేరు నీకెవ్వరూ” మూవీలో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

విజయశాంతి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె దీనిని ఖండించారు. సినిమాలో తనది ఓ ముఖ్యమైన కీలకపాత్ర మాత్రమే కానీ, విలన్ రోల్ కాదు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర నేను చేయనని చెప్పిన ఆమె,మహేష్ కి తనకి మధ్య ఎటువంటి రిలేషన్ కూడా ఉండదు అని స్పష్టత ఇవ్వడంతో, మహేష్ తల్లిగా కనిపించనున్నారనే ఊహాగానాలకు కూడా తెరదించారు. ఇవి రెండు కాకుండా విజయశాంతి చేస్తున్న ఆ ముఖ్యమైన పాత్ర ఏమిటా అని సినీ జనాలు ఆలోచించడం మొదలుపెట్టారు.

సంబంధిత సమాచారం :

X
More