మహేష్ మూవీ తో రీఎంట్రీ పై రాములమ్మ భావోద్వేగ ట్వీట్స్

Published on May 31, 2019 7:00 pm IST

లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ ఇలా చెప్పుకుంటూ పొతే విజయశాంతికి ఉన్న బిరుదు చాలానే ఉన్నాయి. ఎటువంటి సినిమా నేపధ్యం లేకున్నా తన కష్టాన్ని,నటన ను నమ్ముకొని ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో వచ్చిన “కిలాడీ కృష్ణుడు” మూవీతో తెలుగు తెరకు పరిచయమైన విజయశాంతి, కెరీర్ ప్రారంభంలో హీరో చెల్లి పాత్రలు కూడా చేశారు. హీరోయిన్ గా నిలదొక్కుకున్నాక ఆమె వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. దాదాపు రెండు దశాబ్దాలు ఆమె తెలుగు వెండి తెరపై మకుటం లేని మహారాణిగా వెలుగొందారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరో ల సినిమాలలో కూడా ఆమెకు కొన్ని యాక్షన్ సన్నివేశాలతో హీరో కి సమానంగా పాత్రను ఇచ్చేవారు.

“కర్తవ్యం”,” ఒసేయ్ రాములమ్మ” వంటి లేడి ఓరియెంటెడ్ మూవీస్ ఆమెను మరోస్థాయికి తీసుకెళ్లాయి. చివరిగా 2006 లో వచ్చిన నాయుడమ్మ మూవీలో కనిపించిన విజయశాంతి రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఇన్నేళ్ల తరువాత మహేష్ “సరిలేరు నీకెవ్వరు” మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని బొద్వేగ పోస్ట్లు పెట్టారు.

“దైవ సంకల్పమో, దీవించిన ప్రజల అభిమాన ప్రభావమో ఈ నిర్ణయం. బాధ్యతతో కర్తవ్యాన్ని నిర్వర్తించడం మాత్రమే తెలిసిన మీ రాములమ్మ. విజయశాంతి.హిందీ సినిమాల తర్వాత కూడా ఇప్పటికీ అదే గౌరవం అంకితభావం సినిమా పట్ల కళాకారిణిగా నా విధానం. 2020 సినిమాల నుండి కొంత లేదా కొంతఎక్కువ విరామం తరువాత మహేష్ బాబు గారి సినిమా కాంబినేషన్ లో తిరిగి మరొకసారి ఆర్టిస్ట్ గా నా ప్రజల ముందుకు రానున్న సంవత్సరం” అని తన పునరాగమనం పై ఎమోషనల్ గా స్పందించారు. ఎన్నోఏళ్ల తరువాత విజయశాంతి స్రీన్ ప్రజన్స్ ఎలాఉంటుందో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More