“ఆర్ఆర్ఆర్” సీక్వెల్ సాధ్యమేనట.. మరోసారి విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ..!

Published on Apr 5, 2022 2:40 am IST

జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్‌”. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ కలెక్షన్స్‌ని రాబట్టుకుంటూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాకి రాజమౌళి తండ్రి కథని అందించారు. దాదాపు రాజమౌళి అన్ని సినిమాలకి కూడా అతడి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారే కథలు అందిస్తారు.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్ గురుంచి మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్ “ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక రోజు ఎన్టీఆర్‌ మా ఇంటికి వచ్చి ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌ గురించి అడిగాడని, నేను కొన్ని ఐడియాలను చెప్పాను. అవి ఎన్టీఆర్‌, రాజమౌళికి బాగా నచ్చాయి. దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో సీక్వెల్‌ రావొచ్చు అని చెప్పిన సంగతి తెలిసిందే.

కాగా సోమవారం నాడు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. అయితే ఈ పార్టీలో కూడా విజయేంద్ర ప్రసాద్‌ ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై ఓ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్ ఫ్రాంచైజీగా ఉంటుందని, ఈ సినిమాకి సీక్వెల్ సాధ్యమవుతుందని చెప్పాడట. ఆర్ఆర్ఆర్ సినిమానే ఇన్ని రికార్డులు కొల్లగొడుతుంటే దీనికి సీక్వెల్ కనుక వస్తే మరెన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :