పవన్ విషయంలో “RRR” రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్.!

pk

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన చిత్రాలు సహా పాలిటిక్స్ లో కూడా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ లేటెస్ట్ గా ఓ పెళ్లి కార్యక్రమానికి మరియు ఇవాళ ఓ ఈవెంట్ కి హాజరు అయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో పవన్ తో పాటుగా నిర్మాత దిల్ రాజు, సీనియర్ నిర్మాత అశ్వని దత్ లాంటి దిగ్గజాలు కూడా హాజరు కాగా వారితో పాటుగా మన టాలీవుడ్ ప్రముఖ రచయిత వి విజయేంద్ర ప్రసాద్ కూడా హాజరు అయ్యారు.

అయితే ఈ కార్యక్రమంలో పవన్ విషయంలో విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ మంచి ఆసక్తిగా మారాయి. తాను రీసెంట్ గా ఓ వీడియో చూశానని అందులో విజయవాడలో దుర్గమ్మ ఆలయానికి వచ్చిన హిందువులకి దాహార్తి తీర్చడానికి ముస్లింలు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు ఆ దృశ్యం నాకు ఎంతో ఆనందం కలిగించి ఇప్పటికీ కూడా దానిని తలచుకున్నా అంతే ఆనందంగా ఉందని తెలిపారు.

అయితే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి వాతావరణమే ఉండాలి ఇలాంటివి జరగాలి అంటే నీటి నిబద్ధత ఉన్న నాయకుడు కావాలి అయితే అదృష్టవశాత్తు మనకి పవన్ కళ్యాణ్ ఉన్నారు. మీరు అంటే ప్రాణం ఇచ్చే అశేషమైన జన సైనికులు ఉన్నారు.

నేను ఏం చెప్పానో అది దయచేసి మీవారితో చెప్పి మతసామరస్యం పెంచడం కోసం అందుకు అవకాశం, అదృష్టం రెండూ మీకు ఉన్నాయి చెయ్యండి అంటూ తెలిపారు. అయితే విజయేంద్ర ప్రసాద్ సహా పవన్ కూడా మన దేశం పట్ల అపారమైన దేశభక్తి కలవారు మరి పవన్ ఈ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో చూడాలి.

Exit mobile version